Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని నరేంద్ర మోడీ ఫస్ట్ కిక్... సార్క్ సదస్సు రద్దు.. బోరుమన్న పాకిస్థాన్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యూహ రచనకు పాకిస్థాన్ పాలకులు కుదేలైపోతున్నారు. ఆయన ఇచ్చిన తొలి పంచ్‌కు పాకిస్థాన్ విలవిల్లాడిపోతోంది. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఏకాకిని చేయాలన్న పట్టుదల, వ్యూహచతురత, విధా

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2016 (08:17 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యూహ రచనకు పాకిస్థాన్ పాలకులు కుదేలైపోతున్నారు. ఆయన ఇచ్చిన తొలి పంచ్‌కు పాకిస్థాన్ విలవిల్లాడిపోతోంది. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఏకాకిని చేయాలన్న పట్టుదల, వ్యూహచతురత, విధానం విజయవంతమైంది. 
 
పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా నవంబరు నెలలో జరగాల్సిన సార్క్ సదస్సును భారత్ బహిష్కరించింది. దీంతో ఈ సదస్సు రద్దైంది. భారత్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, భూటాన్ దేశాలు సదస్సుకు హాజరుకాలేమని స్పష్టం చేయడంతో సార్క్ దేశాలకు నేతృత్వం వహిస్తోన్న నేపాల్ సదస్సును రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 
 
దీంతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సర్కారుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఫలితంగా అంతర్జాతీయంగా పాక్ ఏకాకైంది. పాక్ మైనస్ సార్క్ చేయాలన్న మోడీ దౌత్య విధానం సత్ఫలితాలిస్తూ నవాజ్ సర్కారుకు చెమటలు పట్టిస్తోంది. యూరీ సెక్టార్‌లోని ఆర్మీ స్థావరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ కన్నెర్ర చేసింది. పాకిస్థాన్‌ను దౌత్యపరంగా చీల్చి చెండాడాలని నిర్ణయించింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments