Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌, చైనాల‌కు రష్యా మిస్సైల్స్‌తో చెక్‌... ‘చేతక్’, ‘చీతా’ల స్థానంలో అత్యాధునిక హెలికాప్టర్లు

పాకిస్థాన్‌, చైనాల‌కు ర‌ష్యా అందించ‌బోయే అత్యాధునిక మిస్సైల్స్‌తో చెక్ పెట్టాలని భారత్ భావిస్తోంది. అంటే వైమానిక దళం వినియోగిస్తున్న చేతక్, చీతా హెలికాప్టర్ల స్థానంలో అత్యాధునిక హెలికాప్టర్లు రంగప్రవే

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (10:02 IST)
పాకిస్థాన్‌, చైనాల‌కు ర‌ష్యా అందించ‌బోయే అత్యాధునిక మిస్సైల్స్‌తో చెక్ పెట్టాలని భారత్ భావిస్తోంది. అంటే వైమానిక దళం వినియోగిస్తున్న చేతక్, చీతా హెలికాప్టర్ల స్థానంలో అత్యాధునిక హెలికాప్టర్లు రంగప్రవేశం చేయనున్నాయి. తద్వారా భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది. ఈ మేరకు గురువారం రష్యాతో భారత్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం డీల్ విలువ రూ.1200 కోట్లు. 
 
ప్రధాని మోదీ గతేడాది డిసెంబరులో రష్యాలో పర్యటించినప్పుడే ఈ ఒప్పందంపై అవగాహన కుదరగా, చర్చల అనంతరం 200 ‘కామొవ్ 226టి’ చాపర్ల కొనుగోలుకు తాజాగా ఒప్పందం కుదిరింది. హెలికాప్టర్లను సరఫరా చేసిన అనంతరం సర్వీస్ కోసం భారత్‌లో ప్రత్యేకంగా ఓ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టు రోస్టెక్ స్టేట్ కార్పొరేషన్ సీఈవో సెర్జాయ్ కెమెజోవ్ తెలిపారు.
 
మరోవైపు.. శ‌నివారం ప్రారంభ‌మ‌య్యే బ్రిక్స్ స‌మావేశాల్లో భాగంగా భార‌త్ ర‌ష్యాతో సుమారు రూ.34 వేల కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇందులో భాగంగా ర‌ష్యా భార‌త్‌కు అత్యాధునిక ఎస్‌-400 అనే ఉప‌రిత‌లం నుంచి గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌యోగించ‌గ‌లిగే క్షిప‌ణుల‌ను అందించ‌నుంది. శ‌నివారం గోవాలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమ‌ర్ పుతిన్ ఈ చారిత్రక ఒప్పందంపై సంత‌కాలు చేయ‌నున్న‌ట్లు ర‌ష్యా ప్ర‌తినిధి యూరీ ఉష‌కోవ్ వెల్ల‌డించారు. ఈ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ ఎస్‌-400 మిస్సైల్‌ను కొనుగోలుకు గ‌త డిసెంబ‌ర్‌లోనే భార‌త ర‌క్ష‌ణ శాఖ ఆమోదం తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షష్టిపూర్తి సినిమా ఇప్పటి జనరేషన్ కోసమే తీసింది : రాజేంద్ర ప్రసాద్

హీరో టు దర్శకుడిగామారి మెగాస్టార్ తో విశ్వంభర చేస్తున్న వశిష్ట

అప్సరా రాణి నటించిన రాచరికం లో రక్త సంబంధాలు ఉండవు

హరి హర వీర మల్లు కోసం కలం పట్టనున్న తమిళ గీత రచయిత

టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్ లో వైల్డ్ లుక్‌లో ఆక‌ట్టుకుంటోన్న య‌ష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments