Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

ఐవీఆర్
శుక్రవారం, 30 మే 2025 (21:17 IST)
అతడు ఒడిశాలో సీనియర్ ప్రభుత్వ ఇంజినీర్. అతడు వుంటున్న ఫ్లాట్ లోపల ఎటుచూసినా రూ. 500 నోట్లతో వున్న పెద్దపెద్ద బండిల్స్. అదేమీ అతడు కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు. ప్రజల నోళ్లు కొట్టి పోగేసుకున్నది. ఈ గుట్టు కాస్తా తెలియడంతో అతడి ఇంట్లో తనిఖీ చేసేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు బయలుదేరారు. వాళ్లు వస్తే ఎలాగూ డబ్బంతా పట్టుకుపోతారనుకున్నాడో ఏమోగానీ, చేతికి అందినంత డబ్బును తను వుంటున్న ఫ్లాట్ కిటికీ నుంచి కిందకు విసిరేయడం ప్రారంభించాడు. అన్నీ రూ. 500 కరెన్సీ నోట్లే. ఇంతలో అవినీతి అధికారులు అక్కడికి రానే వచ్చారు. దాంతో కరెన్సీ వర్షం కాస్తా ఆగిపోయింది.
 
ఇంతకీ ఈ భారీ అవినీతి తిమింగలం పూర్వాపరాలు ఏమిటో చూద్దాము. ఒడిశాలో గ్రామీణాభివృద్ధి శాఖలో వైకుంఠ నాథ్ సారంగి అనే ఈ వ్యక్తి చీఫ్ ఇంజినీర్. ఇంకేం, నిధులన్నీ ఈయన చేతులు మీదుగా ప్రవహిస్తుంటాయి. కనుక ఆ ప్రవాహానికి అక్కడక్కడ అడ్డుకట్టలు వేసుకుంటూ మొత్తం రూ. 2.1 కోట్లు నగదును ఇంట్లోనే బంధించేసాడు. గ్రామీణాభివృద్ధినంతా తన సొంత ఫ్లాట్లోనే చేసుకున్నాడు. బెడ్రూంలో, హాల్లో, ఇలా ఎక్కడబడితే అక్కడ రూ. 500 నోట్ల కట్టలను కుక్కేశాడు.
 
 
గ్రామీణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేవని రోడ్లు, కాలువలు, ఆస్పత్రులు కట్టించమంటే, వాటిలో కొంత మింగేసి అరకొర నిధులను విదిలించాడనే ఆరోపణలు ఇతడిపైన వున్నాయి. తను అడ్డంగా దోచేసిన డబ్బును అవినీతి అధికారులు పట్టుకుంటారని రూ. 2,00,00,000 కరెన్సీ నోట్లను కిటిలో నుంచి విసిరేశాడు. అదేదో నిజాయితీగా గ్రామీణ ప్రజల అవసరాలను తీర్చితే ఎంతో పేరు వచ్చేది. ఇప్పుడంతా ఆయనను, ఛీ ఛీ పేదల పొట్ట కొట్టిన ఇతనేం మనిషి అంటూ చీదరించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments