Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్ల కోట్ల నాగ... బెంగుళూరు రౌడీషీటర్ ఇంట్లో రూ.100 కోట్ల పాత కరెన్సీ

బెంగుళూరులో కోట్లాది రూపాయల పాతకరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. అదీ కూడా ఓ రౌడీ షీటర్. మాజీ కార్పోరేటర్ ఇంట్లో కావడం గమనార్హం. ఆ రౌడీషీటర్, మాజీ కార్పొరేటర్ పేరు నాగా. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (17:13 IST)
బెంగుళూరులో కోట్లాది రూపాయల పాతకరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. అదీ కూడా ఓ రౌడీ షీటర్. మాజీ కార్పోరేటర్ ఇంట్లో కావడం గమనార్హం. ఆ రౌడీషీటర్, మాజీ కార్పొరేటర్ పేరు నాగా. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడటమే కాకుండా, ఇపుడు కూడా పాతనోట్లను బలవతంగా మార్చుతున్నట్టు తేలింది. తాజాగా బయటపడిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మాజీ కార్పొరేటర్‌ వి.నాగా అలియాస్ నాగరాజ్‌ నివాసంలో భారీ మొత్తంలో పాత కరెన్సీ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా రూ.100 కోట్ల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అంతకు ముందు తాళం వేసి ఉన్న ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు లాక్‌ పగలగొట్టి లోనికి వెళ్లగా, అక్కడ గదుల్లో పెద్ద ఎత్తున నగదు గుట్టలుగా పడి ఉండటాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.
 
అనంతరం ఆ ఇంటిని పోలీసులు సీజ్‌ చేశారు. ఇపుడు బయటపడిన నోట్లన్నీ పాత రూ.500, రూ.1000 నోట్లే కావడం గమనార్హం. పేరుమోసిన రౌడీ షీటర్‌గా చెలామణి అయిన నాగా... అనేక దందాలు, సెటిల్‌మెంట్లు, కిడ్నాప్‌లు, హత్యలు చేసిన ఈ కోట్లు కొల్లగొట్టినట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. నాగా భార్యను పోలీసులు అదుపులోకి తీసుకోగా, నాగా మాత్రం పారిపోయాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments