Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా వైద్యుడి వద్ద రూ.10 లక్షల కొత్త కరెన్సీ నోట్లు..

దేశ వ్యాప్తంగా కరెన్సీ కష్టాలు తారా స్థాయిలో ఉన్నాయి. కొత్త నోట్లతో పాటు.. చిల్లర కోసం దేశ ప్రజలంతా వెంపర్లాడుతున్నారు. కానీ, కోల్‌కతాలోని ఒక వైద్యుడి వద్ద ఏకంగా 10 లక్షల రూపాయల కొత్త కరెన్సీ నోట్లు ద

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (09:58 IST)
దేశ వ్యాప్తంగా కరెన్సీ కష్టాలు తారా స్థాయిలో ఉన్నాయి. కొత్త నోట్లతో పాటు.. చిల్లర కోసం దేశ ప్రజలంతా వెంపర్లాడుతున్నారు. కానీ, కోల్‌కతాలోని ఒక వైద్యుడి వద్ద ఏకంగా 10 లక్షల రూపాయల కొత్త కరెన్సీ నోట్లు దొరికాయి. దాంతోపాటు వివిధ దేశాలకు చెందిన రూ.4 లక్షల విలువ చేసే కరెన్సీ కూడా దొరికింది. దీంతో అతడిపై ఫెమా, పీఎంఎల్ఏ చట్టాల కింద ఈడీ అధికారులు కేసులు పెట్టారు. 
 
దేశవ్యాప్తంగా కొత్త కరెన్సీ నోట్లకు తీవ్రంగా కొరత ఏర్పడటంతో ఈడీ అధికారులు దేశంలోని 40 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఎక్కడైనా అక్రమంగా పాత నోట్లను మార్చి కొత్తనోట్లు తీసుకుంటున్నారేమో చూశారు. ఇందుకోసం వివిధ నగరాల్లో ఎక్కడికక్కడ స్థానిక పోలీసులతో కలిసి బృందాలుగా ఏర్పడ్డారు.
 
కోల్‌కతాలో ఆరు, భువనేశ్వర్‌లో రెండు, పారాదీప్‌లో రెండు, గువాహతిలో రెండుచోట్ల ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో భాగంగానే కోల్‌కతా వైద్యుడి బండారం బయటపడింది. పది లక్షల రూపాయల కొత్త కరెన్సీ ఒక్కరి దగ్గరే బయటపడటం అంటే చిన్న విషయం కాదని, దీన్ని ఖచ్చితంగా నల్లధనంతోనే మార్పిడి చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments