Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాకెట్ బాంబులు... పరిశోధనల్లో భారత వాయుసేన

రాకెట్‌లలో వాడే ఇంధనాన్ని కూడా బాంబులుగా తయారు చేయనున్నారు. ఈ దిశగా భారత వాయుసేన పరిశోధనలు చేస్తోంది. అంటే బాంబులతో పాటు రాకెట్‌ కూడా పేలిపోవటంతో శక్తివంతమైన పేలుడు సంభవిస్తుంది.

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (06:21 IST)
రాకెట్‌లలో వాడే ఇంధనాన్ని కూడా బాంబులుగా తయారు చేయనున్నారు. ఈ దిశగా భారత వాయుసేన పరిశోధనలు చేస్తోంది. అంటే బాంబులతో పాటు రాకెట్‌ కూడా పేలిపోవటంతో శక్తివంతమైన పేలుడు సంభవిస్తుంది. ఫలితంగా తక్కువ సమయంలోనే శత్రువుల స్థావరాలను నామరూపాల్లేకుండా చేసి కోలుకోలేని దెబ్బకొట్టవచ్చు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై వాయుసేన విస్త్రృత పరిశోధనలు చేస్తోంది.
 
ఈ ప్రాజెక్టు తొలి దశలో భాగంగా, ద్వంద్వ వినియోగ ఇంధన ఫార్ములా రూపొందించాల్సిందిగా కాంట్రాక్టర్లను ఆహ్వానించింది. నిజానికి ఈ తరహా ఆలోచన ఈనాటికి కాదు. గతంలోనూ ద్వంద్వ వినియోగ ఇంధన రాకెట్లను పలు సందర్భాల్లో వినియోగించారు. 
 
1982లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌, అర్జెంటీనా మధ్య జరిగిన ఫాక్లాండ్స్‌ యుద్ధంలో హెచ్‌ఎంఎస్‌ షెఫీల్డ్‌ యుద్ధ నౌకపై రాకెట్‌ బాంబులతో అర్జెంటీనా దాడి చేసింది. ఆ సమయంలో బాంబులతో పాటు రాకెట్‌ ప్రొపెల్లెంట్‌ కూడా పేలిపోవటంతో భారీ విధ్వంసం జరిగి యుద్ధనౌక సముద్రంలో మునిగిపోయింది. 
 
ప్రస్తుత కాలంలో ఆయుధాలు తక్కువ పరిమాణంలో ఉండి తక్కువ సమయంలో అపార విధ్వంసం సృష్టించేలా ఉండాలి. అలాంటి ఆయుధాలపైనే ప్రపంచ దేశాలు ఇప్పటికే దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలోనే రాకెట్‌ బాంబులను రూపొందించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అడుగులు వేస్తోంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments