Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాబర్ట్ వాద్రాకు ఎయిర్ పోర్టుల్లో ప్రత్యేక హోదా తొలగింపు!

Webdunia
ఆదివారం, 22 ఫిబ్రవరి 2015 (14:19 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు దేశంలోని విమానాశ్రయాల్లో కల్పిస్తూ వచ్చిన ప్రత్యేక హోదాను తొలగించారు. ఈ మేరకు గోవా ఎయిర్ పోర్టు అధికారులు నోటీసు బోర్డు ప్రకటించారు. 
 
గత యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాబర్ట్ వాద్రాకు ఎలాంటి చెకింగ్ లేకుండా ఎయిర్ పోర్ట్‌లోకి వెళ్లే అనుమతి ఉండేది. ఈ వసతిని గోవా విమానాశ్రయ అధికారులు తొలగించారు. యూపీఏ అధికారంలో ఉన్నంతకాలం ప్రభుత్వ పరంగా అందే అన్ని రకాల ప్రత్యేక సేవలు పొందిన ఆయనకు ఇకపై ఆ హోదా కల్పించబోమంటూ ఎయిర్ పోర్టులోనే నోటీసు అంటించారు. 
 
అర్హత లేని వ్యక్తులకు ప్రత్యేక సేవల్ని ఆపాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇటీవల పౌర విమానయాన శాఖకు ఆదేశాలు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక సేవలకు అర్హులైన వ్యక్తుల జాబితాలోని వాద్రా పేరును అధికారులు ప్లాస్టర్‌తో మూసివేశారు. ఇకపై ఆయన ఎయిర్ పోర్ట్ కు వెళితే సాధారణ ప్రయాణికుల మాదిరి పోలీసుల సోదాలకు సహకరించాల్సిందే. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments