Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే నగర్ ఎన్నికలు... విశాల్ నామినేషన్ తిరస్కరణ.. రోడ్డుపైనే ధర్నా

ఆర్కేనగర్ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలైన నామినేషన్‌ను ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించడంతో రోడ్డుపైనే ధర్నాకు దిగిన విశాల్‌ను అరెస్టయ్యారు. ఆర్కే నగర్ నియోజక వర్గంలో స్వతంత్ర్య అభ్యర్థిగా దిగిన విశాల్

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2017 (18:11 IST)
ఆర్కేనగర్ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలైన నామినేషన్‌ను ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించడంతో రోడ్డుపైనే ధర్నాకు దిగిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్కే నగర్ నియోజక వర్గంలో స్వతంత్ర్య అభ్యర్థిగా దిగిన విశాల్.. సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కానీ నామినేషన్‌లో భాగంగా రెండు రెఫరెన్స్ సంతకాలు ఫోర్జరీ అయినట్లు తేలడంతో ఎన్నికల సంఘం అధికారులు దానిని తిరస్కరించారు. 
 
దీనిపై ఎన్నికల సంఘం అధికారులతో మాట్లాడేందుకు వెళ్లిన విశాల్‌, తనకు మద్దతు తెలుపుతూ సంతకాలు చేసిన వారిని కొందరు బెదిరించారని.. దానికి సంబంధించిన వీడియోలు తన వద్ద వున్నాయని చెప్తున్నా నామినేషన్ తిరస్కరించడం జరిగిపోయిందని అధికారులు తెలిపారు. దీంతో అసంతృప్తికి లోనైన విశాల్.. రోడ్డుపైనే తన అభిమానులతో ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా విశాల‌్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు విశాల్‌కు నచ్చజెప్పి.. ఎన్నికల సంఘం అధికారులతో నామినేషన్ తిరస్కరణకు గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. తనకు మద్దతుగా నిలిచిన వారిని కొందరు బెదిరించారని ఆ వీడియోలు తాను సమర్పించేందుకు సిద్ధంగా వున్నానని విశాల్ వెల్లడించారు. దీంతో విశాల్ నామినేషన్ తిరస్కరణ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments