Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతా పెరుగుతున్న మద్దతు.. ఇండియా కూటమి పగ్గాలు అప్పగించాలి.. : లాలూ

ఠాగూర్
బుధవారం, 11 డిశెంబరు 2024 (10:38 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఇండియా కూటమి నేతల మద్దతు క్రమంగా పెరుగుతుంది. ఈ జాబితాలో ఆర్జీడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కూడా చేరిపోయారు. ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలను మమతా బెనర్జీకి అప్పగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, మహారాష్ట్రకు చెందిన మాజీ సీఎం ఉద్ధవ్ బాల్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీలు మమత నాయకత్వానికి దన్నుగా నిలిచాయి. మంగళవారం లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి బాధ్యతలను మమతకు అప్పగించాలని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 
 
లాలూ కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంకా చతుర్వేది కూడా మమతకు మద్దతు తెలి పారు. "ఇండియా కూటమికి మమత నాయకత్వం ఆత్యంత ముఖ్యం" అని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌ను బలోపేతం చేసినట్టే.. ఆమెకు పగ్గాలు అప్పగిస్తే కూటమిని కూడా బలోపేతం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. 
 
శివసేన (యూబీటీ) కీలక నేత సంజయ్ రౌత్ మాత్రం భిన్నంగా స్పందించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేరన్నారు. ఇదిలావుంటే, ఇండియా కూటమిలో సఖ్యత లేదని, పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ విమర్శలు గుప్పించింది. కాగా, మిత్రపక్షాల వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. కూటమి పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించవద్దని ఆయన కాంగ్రెస్ ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments