Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూసుకెళ్తున్న కాంగ్రెస్: హరియాణలో రెజ్లర్ వినేష్ ఫొగాట్ ముందంజ

ఐవీఆర్
మంగళవారం, 8 అక్టోబరు 2024 (09:57 IST)
కర్టెసి-ట్విట్టర్
హరియాణ, జమ్ము-కాశ్మీర్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ గట్టి షాకిస్తూ ముందుకు దూసుకుపోతోంది. హరియాణలో ప్రముఖ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫొగాట్ జులనాలో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక కౌంటింగ్ ఆరంభ ట్రెండ్స్ విషయానికి వస్తే.. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్నట్టు కనిపిస్తోంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ 70కిపై స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇక బీజేపీ 17 కంటే తక్కువ చోట్ల, ఇతరులు పలు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
ఇక దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు ఎన్నికలు జరుపుకున్న కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ బీజేపీ, కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మధ్య హోరాహోరీ పోరు ఖాయమని ఆరంభ ట్రెండ్‌ను బట్టి అర్థమవుతోంది. జమ్మూ కాశ్మీర్ కూడా కాంగ్రెస్ కూటమి 34కు పైగా స్థానాల్లో, బీజేపీ 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
 
ఇకపోతే, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌంటింగ్కు ముందే సంబరాలను మొదలుపెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో కౌంటింగ్ మొదలు కాకముందే హస్తం పార్టీ నాయకులు వేడుకలు మొదలుపెట్టారు. కాగా హర్యానా, జమ్మూ కశ్మీర్ రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ 90 సీట్లు ఉన్నాయి. మేజింగ్ ఫిగర్ 46 సీట్లుగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments