Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాగ్ మాంసంతో బిర్యానీ తయారీ.. వాట్సాప్‌లో ఫేక్.. వ్యక్తి అరెస్ట్

డాగ్ మాంసంతో బిర్యానీ తయారు చేస్తున్నారని ఫేక్ న్యూస్‌ అని తేలింది. ఈ విషయాన్ని వాట్సాప్‌లో పెట్టిన యువకుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెస్టారెంట్ కు వెళ్తున

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (09:30 IST)
డాగ్ మాంసంతో బిర్యానీ తయారు చేస్తున్నారని ఫేక్ న్యూస్‌ అని తేలింది. ఈ విషయాన్ని వాట్సాప్‌లో పెట్టిన యువకుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెస్టారెంట్ కు వెళ్తున్న స్నేహితులను భయపెట్టేందుకు ఎంబీఏ విద్యార్థి వలబోజు చంద్రమోహన్.. తల నరికిన కుక్కల ఫోటోలతో పాటు షా గౌస్ హోటల్ యజమానిని పోలీసులు అరెస్టు కూడా చేశారని ఫేక్ న్యూస్‌ను వారికి ఫార్వాడ్ చేశాడు.
 
దీంతో షాక్‌కు గురైన చంద్రమోహన్ స్నేహితులు తమకు వచ్చిన వివరాలను వేరే వాట్సాప్ గ్రూప్‌లకు ఫార్వాడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వాట్సాప్ గ్రూప్‌లను పరిశీలించుకుంటూ వెళ్లగా చంద్రమోహన్ ఫేక్ న్యూస్‌ను పంపినట్లు గుర్తించామని తెలిపారు. కాగా, షా గౌస్ హోటల్ యజమానిని కుక్క మాంసం బిర్యానీ కేసులో పోలీసులు అరెస్టు చేశారనే వాట్సాప్ మెసేజ్‌ను అన్ని ప్రముఖ న్యూస్ చానెళ్లు ప్రసారం చేశాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 
 
జీహెచ్ఎంసీ హెల్త్ అధికారులు షా గౌస్ హోటల్‌పై రైడ్ నిర్వహించారు. ఫేక్ న్యూస్ కారణంగా తమ హోటల్ పరువుపోయిందని యజమాని మహమ్మద్ రబ్బానీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి విచారణ జరిపి చంద్రమోహన్‌ను అరెస్టు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments