Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొనసాగుతున్న రెడ్ ఆపరేషన్... మరో కీలక స్మగ్లర్ ఆరెస్టు

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (20:02 IST)
ఎర్రచందనం స్మగ్లర్లపై టాస్క్ ఫోర్సు చేస్తున్న వేట వేగంగా కొనసాగుతోంది. ఇటు తమిళనాడు, అటు ఆంధ్రప్రదేశ్ లోని స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు వెంటాడి మరి పట్టుకుంటున్నారు. తాజాగా పోలీసులు చెన్నయ్ లోని అన్నాసలైకి చెందిన ఓ కీలక స్మగ్లరును అరెస్టు చేశారు. 
 
చెన్నైలోని అన్నాసలైకి చెందిన సోము రవిని అరెస్టు చేసి పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోము రవి 23 ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. రవికి సహకరిస్తున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. 
 
శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను కోల్‌కతా, దిల్లీ, ముంబయి, మణిపూర్‌తో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments