Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో రేప్ వీడియోలు ప్లే అవుతుంటే మీరేం చేస్తున్నారు? కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం

సోషల్ మైక్రోబ్లాగింగ్ సైట్ వాట్సాప్‌లో రేప్ వీడియోలు ప్లే అవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. సైబ‌ర్ నేరాల కేసుల దర్యాప్తుపై స్ప‌ష్ట‌మైన విధివిధాన

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (09:07 IST)
సోషల్ మైక్రోబ్లాగింగ్ సైట్ వాట్సాప్‌లో రేప్ వీడియోలు ప్లే అవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. సైబ‌ర్ నేరాల కేసుల దర్యాప్తుపై స్ప‌ష్ట‌మైన విధివిధానాలు రూపొందించ‌క‌పోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్టింది. వారం రోజుల్లో అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. 
 
ఇటీవలి కాలంలో వాట్సాప్‌లో అత్యాచార వీడియోలు ప్ర‌చారమవుతున్నాయి. దీనిపై హైద‌రాబాద్‌కు చెందిన స్వ‌చ్ఛంద సంస్థ 'ప్ర‌జ్వ‌ల' గ‌తంలో సుప్రీంకోర్టుకు లేఖ‌రాసింది. ఈ లేఖ‌తోపాటు వాట్సాప్‌లో ప్ర‌చారంలో ఉన్న రెండు అత్యాచార వీడియోల‌ను పెన్ డ్రైవ్‌ ద్వారా అప్ప‌టి చీఫ్ జ‌స్టిస్ హెచ్.ఎల్.దత్తుకు పంపించింది. కోర్టు దీనిని సుమోటోగా స్వీక‌రించింది. కేసు ద‌ర్యాప్తు చేసి నిందితుల‌ను అదుపులోకి తీసుకోవాల‌ని ఆదేశించింది. 
 
అలాగే సామాజిక మాధ్యమాల్లో అశ్లీల దృశ్యాలు ప్ర‌చారం కాకుండా నియంత్రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార‌శాఖ‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలు జారీ చేసి 11 నెల‌లు గ‌డుస్తున్నా కేంద్రం నుంచి ఎటువంటి స‌మాధానం రాక‌పోవ‌డంపై జ‌స్టిస్ ఎంబీ లోకూర్‌, జ‌స్టిస్ యూయూ ల‌లిత్‌తో కూడి ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశిస్తూ శుక్ర‌వారానికి కేసును వాయిదా వేసింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments