Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసిన వాడితో జైలులో పెళ్లి, అలా ఎందుకో చెప్పిన జైలర్

ఐవీఆర్
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (23:10 IST)
అత్యాచారం చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు తిరిగి అతడు అత్యాచారానికి పాల్పడ్డ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన ఒడిసాలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
ఒడిసాలోని గోచాబాది గ్రామానికి చెందిన సూర్యకాంత్ అనే యువకుడు తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేసాడని 22 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని గత ఏడాది నవంబరులో అరెస్ట్ చేసి రిమాండుకి తరలించారు. దీనితో పెద్దలు రంగంలోకి దిగి ఇరు కుటుంబాల పెద్దలతో పంచాయతీ పెట్టారు. అంతా ఓ నిర్ణయానికి వచ్చారు. నిందితుడు సూర్యకాంత్, బాధిత యువతిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించినట్లు తెలిపాడు.
 
ఆ ప్రకారం న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో ఆదివారం నాడు జైలులో వివాహం జరిపించారు. పెళ్లయ్యాక వరుడు మాత్రం జైల్లోనే వున్నాడు. కేసుకి సంబంధించి పూర్తి తీర్పు వెలువడలేదు కనుక అతడు జైల్లోనే వుండాల్సిన పరిస్థితి. ఈ పెళ్లిని చూసిన జైలర్... నిందితులు తాము చేసిన నేరం నుంచి తప్పుకునేందుకు ఇలాంటివి వారికి బ్రహ్మాండమైన ఆయుధంగా పనికివస్తాయంటూ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం