Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఎస్ఎస్‌కు ఏమైంది?: ఉద్యమకారిణిని రేప్ చేయాలా?

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (15:13 IST)
ఆర్ఎస్ఎస్ మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్లుంది. కర్ణాటకలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సభ్యుడు వీఆర్ భట్ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ఎన్నికల్లో కన్నేసి సామ్నా పత్రికలో పోలీసులను తీవ్రవాదులంటూ.. రంజాన్ ఉపవాస దీక్షను భగ్నం చేసిన వారిని హీరోలంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో జనవిజ్ఞానసమితి రాష్ట్ర కార్యదర్శి ప్రభ బేలమంగళను రేప్ చేయాలంటూ ఆర్ఎస్ఎస్ సభ్యుడు వీఆర్ భట్ ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు వివాదాస్పదమైంది. విషయం ఏమిటంటే... జాతి నిర్మాణానికి అట్టడుగు వర్గాల ప్రజలు ఎంతో సేవ చేశారని, అయితే, ఆ క్రెడిట్ అంతా ఎగువశ్రేణి ప్రజలు దక్కించుకున్నారని ప్రభ ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు. దీనిపై వీఆర్ భట్ స్పందిస్తూ, ఆమెను రేప్ చేయాలంటూ ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టారు. 
 
హిందుత్వం పట్ల వారి ధోరణిలో మార్పు రావాలంటే జుట్టు పట్టుకుని ఈడ్చి, లైంగిక దాడి చేస్తే సరి అని భట్ తన పోస్టులో పేర్కొన్నారు. దీనిపై కర్ణాటకలో దళితసంఘాలు భగ్గుమన్నాయి. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. తనపై భట్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రభ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు