అభంశుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బీహార్‌లో ఓ మృగాడు మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి తర్వాత ఆ పాపను నగ్నంగా చెట్టుకు వేలాడతీశాడు. ఈ దారుణ సంఘటన బీహార్‌లోని మధుబాని జిల్లా కొయోతి సమీపంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది.
విషమ స్థితిలో చెట్టుకు వేలాడుతున్న చిన్నారిని గుర్తించి స్థానికులు, కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. జననా వయవాల వద్ద తీవ్ర గాయాలవడంతో చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బామ్మను చూసేందుకు వచ్చిన చిన్నిని స్నాక్స్ కొనిస్తానని చెప్పి తీసుకువెళ్లిన 20 ఏళ్ల కుర్రాడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు.