Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కోర్కె తీర్చు... నీకు సినిమాల్లో అవకాశమిప్పిస్తా...

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (16:03 IST)
వెండితెరపైన, డాక్యుమెంటరీలు, అడ్వైర్టైజింగ్ రంగాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసే మాయగాళ్లను పట్టేసినా కొత్తకొత్తగా వస్తూనే ఉంటారు. తాజాగా ఓ బాలికకు సినీ ఆశ చూపించి లైంగికంగా వేధించిన ఓ సినీ ట్రైనింగ్ మాస్టర్ బండారం బయటపడింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 47 ఏళ్ల రవీందర్ అనే వ్యక్తి లజపత్ నగర్ సమీపంలో నటనలో శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు.
 
ఇతని వద్ద చాలామంది శిక్షణ పొందుతున్నారు. వీరిలో ఓ మైనారిటీ తీరని బాలిక కూడా ఉంది. ఐతే రవీందర్ కన్ను ఆమెపై పడింది. షూటింగ్ నిమిత్తం అంటూ ఆమెతో పాటు మరికొందరిని గత నెల ఫతేపూర్ బెరీ ప్రాంతానికి తీసుకెళ్లాడ. అక్కడ ఆ బాలికను తన కోర్కె తీర్చాలని ఒత్తిడి చేశాడు. తన కోర్కె తీర్చితే డాక్యుమెంటరీలు, యాడ్ ఫిల్మ్స్ అవకాశాలిప్పిస్తాననీ, ఇంకా తనకు సహకరిస్తే బాలీవుడ్ సినిమాలోనూ అవకాశం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఐతే ఆమె అందుకు ససేమిరా అనడంతో ఆమెపై బలవంతం చేయబోయాడు. దీంతో విషయాన్ని ఆ బాలిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?