Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫకీరుగానే ఉంటా.. పదవులొద్దు : రాందేవ్ బాబా!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (18:46 IST)
కేబినెట్ మంత్రి హోదా ఇస్తామన్న హర్యానా సర్కారు ఆఫర్ను యోగా గురువు రాందేవ్ బాబా తిరస్కరించారు. తాను సన్యాసిగానే ఉంటాను తప్ప.. పదవు(కేబినెట్ హోదా)లేవీ వద్దని తేల్చి చెప్పారు. తన గౌరవార్థం హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సోనేపట్లో ఏర్పాటుచేసిన ఓ పెద్ద కార్యక్రమంలో ఆయనీ విషయం చెప్పారు. 'నేను సన్యాసిని. మానవాళికి సేవచేయడం ఒక్కటే నా ఏకైక లక్ష్యం. నేను ఎలాంటి మంత్రి పదవులు, హోదాల కోసం ఆశించడం లేదు. బాబా గాను, ఫకీరుగానే ఉండిపోవాలనుకుంటున్నాను' అని ఆయన తేల్చి చెప్పారు. 
 
అయితే, రాందేవ్ బాబాకు మంత్రి హోదా, అందుకు సంబంధించిన గౌరవ మర్యాదలు కల్పించాలంటే న్యాయపరమైన చిక్కులు ఎదురు కావచ్చని హర్యానా ప్రభుత్వం అనుమానించింది. అందుకే సోమవారం సాయంత్రమే చేయాల్సిన ప్రకటనను కూడా ఆపేసింది. 
 
అదేసమయంలో రాష్ట్రంలో యోగా, ఆయుర్వేదం, భారతీయ సంస్కృతికి తాను ప్రచారకర్తగా ఉంటానని స్పష్టం చేశారు. అయితే తనకు మంత్రులతో సమానమైన హోదాను కల్పించవొద్దంటూ ప్రభుత్వాన్ని కోరారు. అధికారానికి దూరంగా ఉంటూ.. సేవపై దృష్టిపెడతానన్నారు. ఆదరణ, తిరస్కరణలకు సన్యాసులు అతీతంగా ఉంటారని రాందేవ్ గుర్తు చేశారు. 

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

Show comments