Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాలీపాప్‌తో సంతోషించలేం... రామాలయం నిర్మించాల్సిందే : బీజేపీ ఎంపీ కతియార్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా రామాలయం అంశం తెరపైకి వచ్చింది. లాలీపాప్‌తో సంతోషించలేమనీ, రామాలయం కావాల్సిందేనంటూ భారతీయ జనతా పార్

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (16:48 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా రామాలయం అంశం తెరపైకి వచ్చింది. లాలీపాప్‌తో సంతోషించలేమనీ, రామాలయం కావాల్సిందేనంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అన్నారు. 
 
వివాదాస్పద బాబ్రీమసీదు - రామజన్మభూమి స్థలానికి 15 కిలోమీటర్ల దూరంలో రామాయణ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనిపై సొంత పార్టీ ఎంపీ నుంచే బీజేపీ తాజాగా విమర్శలు ఎదుర్కొంది. మ్యూజియం ఏర్పాటు నిర్ణయాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వినయ్ కతియార్ 'లాలీపాప్'తో పోల్చారు. 'మనం రామమందిరం నిర్మాణానికి ప్రయత్నించాలి. లాలీపాప్‌తో సంతోషించలేం' అని కతియార్ వ్యాఖ్యానించారు.
 
అయోధ్య సమీపంలో ప్రతిపాదిత రామాయణ మ్యూజియం స్థలాన్ని కేంద్ర పర్యాటక మంత్రి మహేష్ శర్మ మంగళవారంనాడు సందర్శించనున్న నేపథ్యంలో కతియార్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'అయోధ్యలో నేను ఎక్కడికి వెళ్లినా రామమందిరం ఎప్పుడు కడతారంటూ సాధువులు నన్ను అడుగుతున్నారు' అని కతియార్ మీడియాకు తెలిపారు.
 
ఈ యేడాది ప్రారంభంలో ఈ అంశాన్ని సుబ్రమణియం స్వామి రాజ్యసభలోనూ లేవనెత్తారు. సమస్య పరిష్కారానికి రోజువారీ విచారణ జరపాలని కూడా స్వామి అప్పట్లో డిమాండ్ చేసారు. రెండ్రోజుల క్రితం కూడా సుబ్రమణ్య స్వామి మాట్లాడుతూ, 2017 ఎన్నికల్లో గెలవాలంటే రామాలయం అంశం కీలకమని అన్నారనీ గుర్తు చేశారు. అందువల్ల ఖచ్చితంగా రామాలయ నిర్మాణం చేపట్టాల్సిందేనని ఆయన గుర్తుచేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments