Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత కొత్త రాష్ట్రపతి కోవింద్... చిత్తుగా ఓడిన మీరా కుమార్

భారత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థి రాంనాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. దీంతో భారత 14వ రాష్ట్రపతిగా ఈనెల 25వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి పదవి కోసం జరి

Webdunia
గురువారం, 20 జులై 2017 (16:40 IST)
భారత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థి రాంనాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. దీంతో భారత 14వ రాష్ట్రపతిగా ఈనెల 25వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి పదవి కోసం జరిగిన ఎన్నికల్లో రాంనాథ్ గోవింద్‌తో యూపీఏ కూటమి అభ్యర్థి తరపున మీరా కుమార్ పోటీపడ్డారు.
 
రాష్ట్రపతి ఎన్నికల కోసం ఓట్ల లెక్కింపు గురువారం జరుగగా, ఈ ఫలితాల్లో రాంనాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. కోవింద్‌కు 65.65శాతం ఓట్ల రాగా, మీరాకుమార్‌కు 34.35 శాట్లు మాత్రమే వచ్చాయి. కోవింద్‌కు వచ్చిన మొత్తం ఓట్ల విలువ 7,02,644కాగా, మీర్ కుమార్‌కు పోలైన ఓట్ల విలువ 3,67,314గా ఉంది.
 
అయితే, ఏపీలో రాంనాథ్‌కు మొత్తం 27189 ఓట్లు రాగా, మీరా కుమార్‌కు ఒక్క ఓటు కూడా దక్కలేదు. అంటే కాంగ్రెస్‌కు మరోమారు ఘోర పరాభవం ఎదురైంది. కాగా, మొత్తం పోలైన వాటిలో 21 ఓట్లు చెల్లబాటు కాలేదు. 
 
కాగా, ఎన్నికలకు ముందే రాంనాథ్ గెలుపు ఖాయమన్న విషయం తేలిపోయింది. ఉభయ సభల్లో ఉన్న ఎన్డీఏ పక్షాల అభ్యర్థులతో పాటు వైసీపీ, టీఆర్ఎస్, అన్నాడీఎంకే కూడా ఎన్డీయేకే మద్దతు తెలపడంతో కోవింద్ రైసినాకు చేరుకోవడం ఖాయమన్న విషయం స్పష్టమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే కోవింద్ ఆధిక్యంలో దూసుకుపోయారు. మీరాకుమార్ ఆయనకు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. 
 
రాంనాథ్ విజయంతో ఢిల్లీతోపాటు కాన్పూరులోని ఆయన నివాసం వద్ద సంబరాలు మిన్నంటాయి. బీజేపీ శ్రేణులు బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. మరోవైపు వివిధ రాజకీయ పక్షాల నేతలు, అధికారులు, ప్రజాపతినిధులు రాంనాథ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కోవింద్‌కు మద్దతు ప్రకటించని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలు శుభాకాంక్షలు తెలియజేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments