Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిని టెర్రస్ పైనుంచి కిందకు తోసి చంపిన 'ప్రొఫెసర్' కొడుకు (వీడియో)

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (11:13 IST)
నవమాసాలు పెంచిపోషించిన తల్లి అనారోగ్యానికిగురై మంచానపడటంతో ఆమెకు సేవ చేయలేక విసిగిపోయిన ప్రొఫెసర్ కుమారుడు... మేడపై నుంచి కిందికి తోసేసి చంపేశాడు. ఆరోగ్యం కోసం ఎండలో కూర్చోబెడ‌తాన‌ని త‌న త‌ల్లిని అపార్ట్‌మెంట్‌పైకి తీసుకెళ్లిన ఆ కొడుకు అక్క‌డి నుంచి ఆమెను కిందకు తోసేసి హ‌త్య చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తంకావడంతో చివ‌ర‌కు అడ్డంగా దొరికిపోయాడు. ఈ దారుణం రాజ్‌కోట్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్‌ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోని గాంధీగ్రామ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో సందీప్ అనే వ్యక్తి ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఈయన తల్లి జై శ్రీబెన్. వృద్దాప్యంతో పాటు.. అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. ఈమె మూడు నెల‌ల క్రితం అపార్ట్‌మెంట్‌పై నుంచి ప‌డి మృతి చెందింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంద‌ని భావించిన పోలీసులు ఈ కేసును క్లోజ్ చేశారు. 
 
అయితే, ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి తాజాగా రాజ్‌కోట్ పోలీసులకు ఓ లేఖ రాసి, సీసీటీవీ ఫుటేజీని కూడా అందించాడు. దీంతో ఈ కేసులో మ‌ళ్లీ ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సందీప్‌ను అరెస్టు చేశారు. పోలీసుల‌ విచార‌ణ‌లో మొద‌ట అస‌త్యాలు చెప్పిన‌ సందీప్ ఆ తర్వాత తమదైనశైలిలో విచారించడంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు. తన తల్లికి ఆరోగ్యం బాగో లేక‌పోవ‌డంతో ఆమెను ఆసుప‌త్రుల చుట్టూ తిప్ప‌లేక‌ విసిగిపోయాన‌ని, అందుకే హ‌త్య చేశాన‌ని చెప్పాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు త‌దుపరి విచార‌ణ‌ను కొన‌సాగిస్తున్నారు. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments