Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలు బస్సు డ్రైవర్‌కు గుండెపోటు - స్టీరింగ్ తిప్పి విద్యార్థులను కాపాడిన విద్యార్థిని

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (11:56 IST)
పలువురు విద్యార్థులతో వెళుతున్న పాఠశాల బస్సు డ్రైవరుకు ఉన్నట్టుండి గుండెపోటురావడంతో అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ సమావేశంలో తెలివిగా వ్యవహరించిన ఓ విద్యార్థిని అందరినీ ప్రమాదం నుంచి కాపాడింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో రాజ్‌కోట్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
 
నగరంలోని భరద్ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో వెళ్తూ గొండాల్ రోడ్డు వద్దకు రాగానే డ్రైవర్ గుండెపోటుతో మెలికలు తిరిగిపోయాడు. అదుపుతప్పి డివైడర్‌‍ దాటిని బస్సు ఎదురుగా వస్తున్న వాహలను ఢీకొంటూపోయింది. దీనిని గమనించి భార్గవి వ్యాస్ అనేక బాలిక వెంటనే స్టీరింగ్ పట్టుకుని బస్సును నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
దీనిపై బాలిక భార్గవి స్పందిస్తూ, 'నేను డ్రైవరు పక్కనే ఉన్న సీట్లో కూర్చొన్నా బస్సు గొండాల్ రోడ్డు వద్దకు చేరుకోగా డ్రైవర్ మాటలు తడబడ్డాయి. అతడి నోరు ఒకవైపునకు వచ్చేసి, ముక్కు నుంచి రక్తం కారింది. స్టీరింగ్ వదిలేసి ఒక పక్కకు పడిపోయాడు. నేను వెంటనే స్టీరింగ్ తిప్పి బస్సును కరెంట్ స్తంభానికి ఢీకొట్టి ఆపాను" అని భార్గవి తెలిపింది. డ్రైవర్ హారున్ భాయ్‍‌ను రాజ్‍‌కోట్ సివిల్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments