సుపారీ లేదా హత్య.. రాజీవ్ గాంధీ హత్యోదంతంపై బీజేపీ స్వామి సంచలన వ్యాఖ్యలు

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోతారనే విషయం తమకు ముందే తెలుసునని కాంగ్రెస్ పార్టీ చీఫ్ ర

Webdunia
సోమవారం, 12 మార్చి 2018 (14:45 IST)
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోతారనే విషయం తమకు ముందే తెలుసునని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్వామి అనుమానం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యోదంతాన్ని ప్రస్తావిస్తూ.. సుపారీ హత్య లేదా పథకం ప్రకారం ఆర్థిక ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీని చంపించినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. 
 
రాజీవ్ గాంధీ హత్యపై దర్యాప్తు జరిపించాలని స్వామి డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ హంతకులను క్షమిస్తున్నట్లు రాహుల్ గాంధీ చేసిన ప్రకటన దేశభక్తి లేకపోవడానికి నిదర్శనమని సుబ్రహ్మణ్య స్వామి విమర్శించారు. రాజీవ్ గాంధీ అచ్చమైన జాతీయ వాది అని.. ఆయన హత్యకు బాధ్యులైన వారిలో విధేయత లేదన్నారు. అలాంటి వారి పట్ల సానుకూలత చూపించాల్సి అవసరం ఏమొచ్చిందని తెలిపారు.
 
రాహుల్ ప్రకటన దేశభక్త రహితమేనని.. మాజీ ప్రధాని హంతకులకు శిక్ష విధించారని రాహుల్ అర్థం చేసుకోవాలని హితవు పలికారు. రాజీవ్ గాంధీని రాహుల్ గాంధీ తండ్రిగా కాకుండా దేశ ప్రధానిగా చూడాలన్నారు. ఇతర దేశస్థులతో కలిసి మాజీ ప్రధానిని హతమార్చిన వారిపై సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని స్వామి చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments