Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య శరీరంపై బూతు టాటూలు... రాజస్థాన్ మహిళపై సోదరులతో కలిసి భర్త గ్యాంగ్ రేప్...

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలొచ్చినా వారిపై అకృత్యాలు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళను

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (16:09 IST)
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలొచ్చినా వారిపై అకృత్యాలు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళను దారుణంగా హింసించిన అత్తింటివారు ఆమెను తీవ్రంగా కొట్టారు. దీంతో స్పృహ కోల్పోయాక శరీరంపై ఏడు పచ్చబొట్లు పొడిచారు. అంతటితో వదలకుండా మా నాన్న దొంగ అంటూ పచ్చబొట్టు పొడవడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. కట్నం కోసం అత్తింటి వారే ఇలా తనను వేధించినట్లు చెప్పారు. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ అల్వార్‌కు సమీపంలోని ఓ వ్యక్తితో బాధిత మహిళకు 2015లో పెళ్లైంది. అయితే కట్నంగా ఇవ్వాల్సిన రూ.51వేలు పెళ్లి సందర్భంగా వధువు తల్లిదండ్రులు ఇవ్వలేకపోయారు. ఈ విషయమై తరచూ అత్తింటివారి నుంచి బాధిత మహిళ వేధింపులకు గురిచేసేవారు. డబ్బు కోసం నానా హింసలు పెట్టేవారు. శారీరకంగానే కాకుండా మానసికంగానూ దాడి చేసేవారు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెతో మత్తుమందు కలిపిన పానీయం ఆమెకు తాగించి దారుణంగా కొట్టారు. ఆపై ఆమె శరీరంపై కనికరం లేకుండా ఏడు పచ్చబొట్లు పొడిచారు. అంతేగాకుండా బాధితురాలు నుదుటిపై మా నాన్న దొంగ అంటూ రాశారు. ఈ ఘటనపై బాధితురాలితో పాటు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తాను సామూహిక అత్యాచారానికి గురైయ్యానని... తనకు వైద్యపరీక్ష నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం