శృంగారంలో పాల్గొంటేనే పాస్ మార్కులేస్తా : లెక్చరర్ వికృత చేష్టలు

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (16:08 IST)
ఓ లెక్చరర్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తానొక ఉన్నతమైన వృత్తిలో ఉన్నాననే విషయాన్ని మరచిపోయిన ఆ లెక్చరర్ తన వద్ద చదువుకునే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. తనతో శృంగారంలో పాల్గొంటేనే పాస్ మార్కులు వేస్తానంటూ షరతు విధించింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని  నీమ్‌రానాలో వెలుగు చూసింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నీమ్‌రానాలోని ఓ ప్ర‌భుత్వ కాలేజీలో పొలిటిక‌ల్ సైన్స్ లెక్చ‌ర‌ర్‌గా ప‌ని చేస్తున్న ఓ 45 ఏళ్ల వ్య‌క్తి.. విద్యార్థినుల ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. ప‌రీక్ష‌ల్లో మంచి మార్కులు రావాలంటే త‌న‌తో శృంగారంలో పాల్గొనాలంటూ ఒత్తిడి చేయసాగాడు. తన మాట వినని పక్షంలో ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ చేస్తాన‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డసాగాడు. 
 
దీంతో ఆ లెక్చ‌ర‌ర్ బాధ‌లు భ‌రించ‌లేని విద్యార్థినులు.. కాలేజీకి వ‌చ్చిన బ్లాక్ ఎడ్యుకేష‌న్ ఆఫీస‌ర్ ముందు త‌మ గోడును వెల్ల‌బోసుకున్నారు. పొలిటిక‌ల్ సైన్స్ లెక్చ‌ర‌ర్ వేధింపుల‌కు ఎడ్యుకేష‌న్ ఆఫీస‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. 
 
ఈ ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించిన ఎడ్యుకేష‌న్ ఆఫీస‌ర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టం కింద పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. లెక్చ‌ర‌ర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. లెక్చ‌ర‌ర్‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం