Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల్య వివాహల సవరణ బిల్లుపై రాజస్థాన్ యూటర్న్

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (13:05 IST)
బాల్య వివాహల సవరణ బిల్లుపై రాజస్థాన్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. మైనర్లతో సహా అన్ని వివాహాలను రిజిస్టర్ చేయాలని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం తెచ్చిన చట్టంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో గెహ్లాట్ సర్కార్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. గవర్నర్ వద్దకు పంపిన బాల్య వివాహాల సవరణ బిల్లును వెనక్కి తీసుకురానున్నట్లు సీఎం గెహ్లాట్ చెప్పారు. నిజానికి రాజస్థాన్‌లో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువ. 
 
అయితే ఆ ఆచారాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. బాల్య వివాహలను అడ్డుకునేందుకు ఆ పెళ్లిళ్లు రిజిస్టర్ చేయాలన్న చట్టాన్ని తెచ్చారు. అయితే ఆ సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆందోళనలు మిన్నంటాయి. మైనర్ వివాహాలను రిజిస్టర్ చేయాలని కోరితే, దాని వల్ల బాల్య వివాహాలను ఎంకరేజ్ చేసినట్లు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
 
18 ఏళ్ల లోపు అమ్మాయిలు, 21 ఏళ్ల లోపు అబ్బాయిలు ఒకవేళ పెళ్లి చేసుకుంటే, వాళ్లు కచ్చితంగా పెళ్లి రిజిస్టర్ చేయాలని కొత్త చట్టంలో పేర్కొన్నారు. ఆ చట్టం పట్ల అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బాల్య వివాహాలను రూపుమాపాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఉందని సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. బాల్య వివాహాలను అడ్డుకునే విషయంలో తామేమి వెనుకడుగు వేయబోమన్నారు. 
 
అన్ని పెళ్లిళ్లు రిజిస్టర్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడే కొత్త చట్టాన్ని రూపొందించినట్లు గెహ్లాట్ చెప్పారు. కానీ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో గవర్నర్ వద్ద ఉన్న సవరణ బిల్లును వెనక్కి రప్పించనున్నట్లు సీఎం గెహ్లాట్ వెల్లడించారు. సెప్టెంబర్ 17వ తేదీన బాల్య వివాహాల సవరణ బిల్లును పాస్ చేశారు. కానీ ఆ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ.. సభ నుంచి వాకౌట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments