Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వెంకయ్య నాయుడు నామినేషన్... ఆ తర్వాత జర్మనీ పర్యటనకు పయనం

Webdunia
సోమవారం, 30 మే 2016 (10:31 IST)
రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సోమవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఆయనను రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయించిన విషయం తెల్సిందే. 
 
దీంత సోమవారం ఉదయం 9.30కు ఢిల్లీ నుంచి బయల్దేరి 10.30కు జైపుర్‌ చేరుకొని స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు రాజస్థాన్‌ శాసనసభలో నామినేషన్‌ దాఖలు చేస్తారు. అనంతరం ఢిల్లీకి చేరుకొని జర్మనీ పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం జర్మనీకి చేరుకుంటారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా జర్మనీ మంత్రి బార్బరా హెన్డ్రిక్స్‌తో కలిసి మెట్రోపాలిటిన్‌ సొల్యూషన్‌ ఫెయిర్‌ను సందర్శిస్తారు. 
 
పట్టణాభివృద్ధి, ప్రాదేశిక అభివృద్ధిలపై అక్కడి అధికారులతో సమావేశమవుతారు. భారత్‌లో 100 ఆకర్షణీయ నగరాల నిర్మాణం గురించి వివరించి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. జర్మనీలో ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి ఉపయోగిస్తున్న సాంకేతికత, ఇతర పద్ధతులపై అధ్యయనం చేయనున్నారు. బుధవారం బెర్లిన్‌లోని ట్రాఫిక్‌ నిర్వహణ కేంద్రాన్ని సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం భారత్‌కు తిరిగి వస్తారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments