Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజారిని సజీవ దహనం చేశారు.. భూమికోసం పెట్రోల్ పోసి ఘోరంగా..?

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (17:07 IST)
పరువు హత్యలు ఒకవైపు, మహిళలపై అఘాయిత్యాలు మరోవైపు.. ఇక కక్షలు వేరొక వైపు.. ఇలా దేశంలో నేరాల సంఖ్య మాత్రం పెరిగిపోతుంది. తాజాగా రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 50 ఏళ్ళ పూజారిని దుండగులు పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఈయనను బాబూలాల్ వైష్ణవ్‌గా గుర్తించారు. 5.2 ఎకరాల భూమికి సంబందించిన వివాదమే ఈ ఘోరానికి కారణమని తెలుస్తోంది. 
 
రాధాకృష్ణ టెంపుల్ ట్రస్టుకు చెందిన ఈ భూమి జిల్లా సమీపంలోని గ్రామంలో ఉంది. అయితే ఈ స్థలాన్ని ప్రభుత్వం పూజారుల మనుగడకు కేటాయించింది. ఇక్కడే తన సొంత ఇంటిని నిర్మించుకోవాలని వైష్ణవ్ నిర్ణయించుకుని అందుకు ప్రయత్నించగా గ్రామంలోని అగ్ర వర్ణ మీనా కులస్థుల కన్ను ఈ భూమిపై పడింది. 
 
వారు అక్రమంగా అక్కడ షెడ్ నిర్మించగా వైష్ణవ్ అభ్యంతరం చెప్పడంతో పంచాయతీ గ్రామ పెద్దలవరకు వెళ్ళింది. అయితే తీర్పు పూజారికి అనుకూలంగా రావడంతో అగ్రవర్ణ కులస్థులు కక్ష గట్టి వైష్ణవ్ ఫై పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments