Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ రూల్స్ బ్రేక్ : కుటుంబానికి రూ.6 లక్షలు అపరాధం

Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (13:34 IST)
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఏ కుటుంబానికి అధికారులు ఏకంగా ఆరు లక్షల రూపాయల మేరకు అపరాధం విధించారు. కోవిడ్ రూల్స్ అమల్లో ఉన్న సమయంలో పెళ్లి నిర్వహించాడు. ఈ పెళ్లికి 50 మంది వరకు అతిథులు హాజరయ్యారు. వీరిలో 15 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ అధికారులు ఆ కుటుంబానికి ఏకంగా రూ.6 లక్షల అపరాధం విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని భిల్వారా జిల్లాకు చెందిన గీసులాల్ రాఠీ ఈ నెల 13న తన కుమారుడికి వివాహం జరిపించాడు. కరోనా కారణంగా పెళ్లికి 50 మంది అతిథులు మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఉండగా, నిబంధనలు పక్కనపెట్టి గీసులాల్ ఈ పెళ్లికి పెద్ద సంఖ్యలో అతిథులను ఆహ్వానించాడు. 
 
ఈ వివాహానికి హాజరైన వారిలో 15 మందికి మహమ్మారి సోకినట్టు ఆ తర్వాత నిర్ధరణ అయింది. వీరిలో ఒకరు చనిపోయారు కూడా. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఈ నెల 22న గీసులాల్‌పై కేసు నమోదు చేశారు.
 
అలాగే, కరోనా సోకిన వారిని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందించారు. వీరికి కరోనా పరీక్షల నిర్వహణ, చికిత్స, ఆహారం, అంబులెన్స్‌ తదితర వాటికి మొత్తంగా రూ.6,26,600 అయింది. 
 
దీంతో ఈ మొత్తాన్ని గీసులాల్ కుటుంబం నుంచి వసూలు చేయాలని నిర్ణయించిన కలెక్టర్ రాజేంద్ర భట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మొత్తాన్ని వసూలుచేసి ముఖ్యమంత్రి సహాయనిధిలో డిపాజిట్ చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments