Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజంతా ఎండలో కట్టేశాడనీ... యజమాని తల కొరికేసిన ఒంటె.. ఎలా?

Webdunia
బుధవారం, 25 మే 2016 (13:24 IST)
పగలు, ప్రతీకారాలు, కోపాలు మనుషులకే అనుకుంటే పొరపాటు.... జంతువులు కుడా పగతీర్చుకుంటాయని తెలుసా... అలాంటి ఒక ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఆ ఒంటె యజమాని దాన్ని ఎండలో కట్టి ఉంచాడని కోపంతో యజమాని తలను యాపిల్ పండు కొరికినట్టు కొరికి చంపేసింది. 
 
పూర్తి వివరాల్లోకి వెళ్తే... రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన ఒంటెను యథావిధిగా రాత్రి పూట ఇంటి బయట కట్టేసి ఉంచాడు. అయితే మరుసటి రోజు ఉదయం అనుకోనివిధంగా యజమాని ఇంటికి బంధువులు రావడంతో కట్టేసి ఉంచిన ఒంటెను చల్లటి ప్రదేశంలోకి మార్చడం మర్చిపోయాడు. దీంతో రోజంతా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలో సలసల కాగే ఎండలో అది మాడిమాసై పోయింది. 
 
ఒంటెను ఎండలోనే కట్టేసి ఉంచిన విషయం ఆలస్యంగా గుర్తుకు రావడంతో వెంటనే ఒంటెను చల్లటి ప్రదేశానికి మార్చడానికి యజమాని వెళ్లాడు. ఆ యజమానిని చూడగానే ఉక్రోషంతో ఊగిపోయిన ఒంటె ఒక్కసారిగా అతని మీద దాడి చేసి అతని తలను కొరికేసి, అతని పీకను పట్టుకుని అటు ఇటు విసిరికొట్టింది. దీంతో ఆ ఒంటె యజమాని అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఆఖరికి ఆ ఒంటెను 25 మంది గ్రామస్తులు 6 గంటల పాటు శ్రమించి ఒంటెను శాంతింపజేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని ఒంటె యజమానులు భయాందోళనలకు గురయ్యారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments