Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూఢచర్యానికి పాల్పడిన రాజస్థాన్ మాజీ మంత్రి పీఏ - అరెస్టు

ఠాగూర్
గురువారం, 29 మే 2025 (17:16 IST)
గూఢచర్యం కేసులో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిన సకూర్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈయన గతంలో ఆ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి వద్ద పీఏగా పని చేశారు. ఫోనులో పాక్ నంబర్లు, ఏడుసార్లు పాకిస్థాన్ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే, అతనికి ఐఎస్ఐకు ఉన్న సంబంధంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
రాజస్థాన్ రాష్ట్ర ఉపాధి కార్యాలయంలో పనిచేస్తున్న సకూర్ ఖాన్ మంగళియార్‌ను సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ ఐఎస్ఐ సంస్థకు ఆయన కీలక సమాచారం చేరవేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్టు చేశారు. సకూర్ ఖాన్ పాక్ సరిహద్దుల్లోని జైసల్మేర్ జిల్లా బరోడా గ్రామానికి చెందిన మంగళియార్‌ధానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 
 
గత రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రి వద్ద వ్యక్తిగత సహాయకుడుగా పని చేసినట్టు వార్తలు రావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, సదరు మంత్రి కూడా బరోడా గ్రామానికి చెందినవారు కావడం గమనార్హం. 
 
సకూర్ అనుమానాస్పద కార్యకలాపాల గురించి ఉన్నత స్థాయి నుంచి మాకు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని నిర్ధారించుకుని, ప్రశ్నించేందుకే అతడిని అరెస్టు చేశాం అని ఎస్పీ సుధీర్ చౌద్రీ మీడియాకు తెలిపారు. 
 
మరోవైపు, పాకిస్థాన్‌కు గూఢ చర్యానికి మరో యూట్యూబర్ పాల్పడ్డాడు. అతని పేరు సన్నీ యాదవ్. ఇటీవల పాకిస్థాన్‌ను ఆయన బైక్ టూర్ నిర్వహించాడు. దీంతో సన్నీ యాదవ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సన్నీ యాదవ్‌కు సంబంధించిన పాక్ టూర్ వివరాలను సేకరించే పనిలో ఎన్.ఐ.ఏ అధికారులు నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments