Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ కుర్రాడి చేతి వేళ్ళను తొలగించిన వైద్యుడికి రూ.4.5లక్షల జరిమానా

ఓ మైనర్ కుర్రాడి చేతి రెండు వేళ్ళను అతని తల్లిదండ్రుల అనుమతి లేకుండా తొలగించిన వైద్యుడి పట్ల ఢిల్లీ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీవ్రంగా స్పందించింది. డాక్టర్‌కు భారీ జరిమానా విధించింది

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (09:10 IST)
ఓ మైనర్ కుర్రాడి చేతి రెండు వేళ్ళను అతని తల్లిదండ్రుల అనుమతి లేకుండా తొలగించిన వైద్యుడి పట్ల ఢిల్లీ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీవ్రంగా స్పందించింది. డాక్టర్‌కు భారీ జరిమానా విధించింది. బాధిత కుర్రాడి కుటుంబానికి రూ. 4.5 లక్షల పరిహారం చెల్లించాలని  ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లో ఎ.కె.సర్కార్ అనే డాక్టర్.. 2004లో సంపత్ కుమార్ అనే బాలుడి చేతి రెండు వేళ్ళు ఆపరేషన్ చేసి తీసేశాడు. ఓ మిల్లులో రంపపు మిషన్‌లో ప్రమాదవశాత్తూ తన కొడుకు చెయ్యి పడిపోగా అతని తండ్రి డాక్టర్ సర్కార్ నిర్వహిస్తున్న ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు.
 
అక్కడ సంపత్ పేరెంట్స్ పర్మిషన్ తీసుకోకుండానే సర్కార్ అతని రెండు వేళ్ళు తొలగించాడు. దీంతో సంపత్ తండ్రి కోర్టుకెక్కాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సర్కార్ ఈ క్రిమినల్ కేసులో దోషి అని ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే దాన్ని సర్కార్ సవాలు చేయగా ఆ పిటిషన్‌ను కమిషన్ కొట్టివేసింది.

తను సంపత్ చేతి వేళ్ళను తొలగించలేదన్న డాక్టర్ వాదన నమ్మదగినదిగా లేదని కమిషన్ అభిప్రాయపడింది. సంపత్ కుటుంబానికి నాలుగున్నర లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments