Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య, తండ్రిని కాపాడబోయిన భర్త.. ముగ్గురూ చనిపోయిన వైనం.. ఎలా?

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (11:42 IST)
కోడలిని కాపాడేందుకు మామ, వారిద్దరినీ కాపాడేందుకు భర్త చెరువులో దూకి ప్రాణాలు విడిచారు. రాజస్థాన్‌లోని బీకనెర్ జిల్లాలోని లూణాకరణ్‌సర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సీఓ దుర్గాపాల్ అందించిన సమాచారం ప్రకారం కిస్తురియా గ్రామంలో భన్వర్‌లాల్ అనే వ్యక్తి కుటుంబంతోపాటు నివసిస్తున్నాడు. సాయంత్రం 6 గంటల సమయంలో కోడలు లక్ష్మి (23) మంచినీళ్లు తేవడానికి చెరువు వద్దకు వెళ్లింది. నీళ్లు తోడుతుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి చెరువులో పడిపోయింది. 
 
భయంతో ఆమె కేకలు వేయగా మామ భన్వర్‌లాల్(50) అక్కడకు పరుగున వచ్చి, కోడలి పరిస్థితిని చూచి కాపాడేందుకు తాను కూడా చెరువులోకి దూకాడు. వారిద్దరూ మునిగిపోవడం చూసి లక్ష్మి భర్త లేఖ్‌రామ్ (24) కూడా వారిని కాపాడేందుకు చెరువులో దూకాడు. చెరువు చాలా లోతుగా ఉండటంతో బయటకు రాలేకపోయారు. పరిస్థితిని గమనించిన భన్వర్‌లాల్ భార్య వారిని రక్షించేందుకు తాడును విసిరింది. వారు దానిని పట్టుకోవడంలో విఫలమై చెరువు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. చెరువు 15 అడుగుల లోతు ఉన్నందున మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు నీటిని మోటార్‌లతో బయటకు తోడుతున్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments