Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి ఒక్కరికీ కన్ఫార్మ్ టిక్కెట్.. రైల్వే శాఖ భారీ ప్రణాళిక

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2023 (10:00 IST)
ప్రయాణికుల అవసరాలకు తగినట్టుగా రైల్వేలను తీర్చిదిద్దేందుకు భారతీయ రైల్వే శాఖ భారీ ప్రణాళికను అమలు చేయనుంది. ఇందుకోసం రూ.300 కోట్ల మేరకు ఖర్చు చేయనుంది. ఇది అనుకున్నట్టుగా పూర్తయితే, వచ్చే 2027 నాటికి వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు అనే మాటే ఉంది. ప్రతి ఒక్కరికీ కన్ఫార్మ్ టిక్కెట్ లభిస్తుంది. ఇందుకోసం భారీ విస్తరణ దిశగా అడుగులు వేస్తుంది. 
 
ప్రస్తుతం సాధారణ రోజుల్లో కంటే పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ అమితంగా ఉంటుంది. దీనికితోడు కొన్ని మార్గాల్లో ప్రయాణికుల రద్దీ నిత్యం ఉంటూనే ఉంది. దీంతో అనేక మంది ప్రయాణికులు రైళ్ల స్థానంలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఇలాంటి వారందరికీ కన్ఫార్మ్ టిక్కెట్లు ఇచ్చేలా రైల్వే శాఖ భారీ ప్రణాళికను రూపొందించింది. ఇటీవల బీహార్ రాష్ట్రంలో అమిత రద్దీగా ఉన్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించి ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో రైల్వే వర్గాలు ఈ విషయాలను వెల్లడించాయి.
 
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ప్రస్తుతం ప్రతి రోజూ దేశంలో 10,748 రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ సంఖ్యను 13 వేలకు రైల్వే పెంచనుంది. ఏటా 5 వేల కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌లు అందుబాటులోకి తేవడంతో పాటూ వచ్చే నాలుగేళ్లలో 3 వేల కొత్త రైళ్లను సిద్ధం చేయనున్నారు. ప్రస్తుతం ఏటా 800 కోట్లు మంది రైళ్లల్లో ప్రయాణిస్తుండగా ఈ సంఖ్యను వెయ్యికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
 
ప్రయాణ సమయం తగ్గించడంపై కూడా రైల్వే దృష్టిపెట్టింది. రైళ్లు బయలుదేరే, ఆగే సమయాల్లో సమర్థవంతమైన వేగ నియంత్రణ, అదనపు రైల్వే ట్రాక్స్ జోడింపు వంటి వ్యూహాలతో ప్రయాణ సమయం తగ్గుతుందని చెబుతోంది. వేగం నియంత్రణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కొత్త టెక్నాలజీపై దృష్టిపెట్టింది. ఈ దిశగా చర్యలు సఫలమైతే ఢిల్లీ - కోల్‌కతా మధ్య ప్రయాణం 20 నిమిషాల నుంచి రెండు గంటల వరకూ తగ్గుతుందని చెబుతోంది. 
 
పుష్, పుల్ టెక్నిక్‌తో రైలు వేగం నియంత్రణ మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఏటా 225 పుష్, పుల్ టెక్నాలజీ ట్రెయిన్లు తయారవుతున్నాయి. ఇక అత్యాధునిక వందే భారత్ రైళ్లలో వేగ నియంత్రణ సామర్థ్యం సాధారణ రైళ్లతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments