Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి - అదానీకి ఉన్న సంబంధం ఏంటి? : రాహుల్ ప్రశ్న

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (17:04 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారత పారిశ్రామికవేత్త అదానీకి మధ్య ఉన్న సంబంధం ఏంటని పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూటింగా ప్రశ్నించారు. నరేంద్ర మోడీ గుజరాత్ నుంచి ఢిల్లీకి రాగానే అసలు మ్యాజిక్ మొదలైందన్నారు. అదానీ అస్తి విలువ బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 140 బిలియన్ డాలర్లకు ఎలా చేరిందని ఆయన ప్రశ్నించారు. 
 
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభలో మాట్లాడారు. గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఉన్నపుడు ఈ అనుబంధం మొదలైంది. మోడీతో కలిసి ఓ వ్యక్తి తిరిగేవాడు. ఆయనకు నమ్మకంగా ఉండేవాడు. 2014లో ఢిల్లీకి మోడీ చేరుకున్నాక అసలు మ్యాజిక్ మొదలైంది" అని ఎద్దేవా చేసాడు. అదానీ అంశంపై పార్లమెంట‌్‌లో చర్చ జరుగకుండా ప్రధాని మోడీ సర్కారు అన్ని రకాలైన ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. 
 
అదానీ దాదాపు 10 రంగాల్లో వ్యాపారం చేస్తున్నారని గుర్తు చేసిన రాహుల్.. 2014 నుంచి 2022 మధ్య ఆయన ఆస్తులు బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు ఎలా వెళ్లాయని యువత అడుగుతున్నారని ప్రశ్నించారు. ప్రపంచ కుబేరుల్లో 600వ ర్యాంకులో ఉన్న అదానీ.. రెండో ర్యాంకుకు ఎలా చేరుకున్నారని రాహుల్ ప్రశ్నించారు. 
 
ముఖ్యంగా, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వంటి ఏ వ్యాపారంలోనైనా అదానీ ఎపుడూ విఫలం కాలేదన్నారు. అనేక రంగాల్లో అదానీ ఇంత విజయాన్ని సాధించారని తాను పూర్తి చేసిన భారత్ జోడో యాత్రలో అనేక మంది యువత ప్రశ్నించారని, అస్సలు మోడీకి, అదానీకి ఉన్న సంబంధం ఏమిటని రాహుల్ లోక్‌సభ వేదికగా నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments