Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ సూటు ఖరీదు రూ. 10 లక్షలు ఇదంతా ఎవరి సొమ్ము : రాహూల్

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (07:46 IST)
తానో పేదల మనిషినని.. తన జీవన శైలి చాలా సాధాసీదా ఉంటుందని చెప్పే మోదీపై రాహూల్ గాంధీ మాటల తూటాలు పేల్చారు. ఆయన వేషధారణ మొదలు ఆయనిచ్చిన హామీలను కూడా తూర్పాడబట్టారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల వివరాలిలా ఉన్నాయి. 
 
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంలో మోదీ వేసుకున్న సూటు ఖరీదు అక్షరాలా రూ. 10 లక్షలని ఆయన ఆరోపించారు. తానో సామాన్యుడినని పదే పదే చెప్పే మోదీ తన షూటు నిండా తన పేరు కుట్టించుకుని ప్రచారం చేసుకున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. మోదీ వ్యవహారానికి.. చెప్పే మాటలకు ఎటువంటి సంబంధం లేదని ఆయన ఆరోపించారు. ఇదే వ్యవహర శైలితో జనాన్ని మోసం చేస్తున్నారని చెప్పారు. 
 
విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామంటూ ప్రగల్భాలు పలికిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారతీయులను మోసం చేశారన్నారు. ఆక ఆమ్ ఆద్మీ పార్టీ అయితే.. దేశ రాజధానిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తోందని ఆయన విమర్శించారు. వచ్చిన అవకాశాన్ని కాలదన్ని తిరిగి ఎన్నికలు రావడానికి ఆమ్ ఆద్మీ పార్టీనే కారణమని అన్నారు. 

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

Show comments