Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా తప్పుకుని రాహుల్‌కి దారివ్వాలి: డిగ్గీ కామెంట్

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (14:15 IST)
కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీకి అప్పగించి సోనియా గాంధీ పక్కకు తప్పుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలకు సిద్దం అవుతున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 
 
ఓటమిలను, ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న పార్టీని పునరుత్తేజితం చేయాల్సిన బాధ్యత రాహుల్ మీద ఉందని, అందుకు సమయం కూడా ఆసన్నమైందని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు.రాహుల్ పార్టీ అధ్యక్షుడు అయ్యేందుకు ఇంకా సమయం ఆసన్నం కాలేదన్న వాదనలను ఆయన ఖండించారు.
 
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రస్తుతం సాగుతోంది. అది ఈ ఏడాది చివరకు పూర్తవుతుంది. 2015లో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌కు ఇంతకు మించి మంచి తరుణం దొరకబోదని దిగ్విజయ్ పేర్కొన్నారు.

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

Show comments