ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసేందుకు దేవుడు మోడీని పంపాడు : రాహుల్ సెటైర్

ఠాగూర్
బుధవారం, 29 మే 2024 (09:52 IST)
ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసేందుకు దేవుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమిపైకి పంపించారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ఓ లక్ష్యం కోసం తనను ఆ దేవుడే పంపాడని, తనను తాను దేవుడికి అంకితం చేసుకుంటున్నానని ప్రధాని మోడీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
పేదలకు కాకుండా, ఓ బిజినెస్‌మేన్‌కు సాయపడేందుకే మోడీని దేవుడు పంపి ఉంటారని ఎద్దేవా చేశారు. మోడీ దేశంలో 22 మంది బిలియనీర్లను తయారు చేశారని, వారికి సంబంధించి రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు. ఈ విషయంలో మోడీని జాతి ఎప్పటికీ క్షమించబోదని రాహుల్ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక కోట్లాది మందిని లక్షాధికారుల స్థాయికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
 
ప్రధాని మోడీ పోటీ చేస్తున్న వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇవాళ ఇండియా కూటమి సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, జూన్ 4 తర్వాత మోడీ ప్రధాని కాబోరని, ఇది తన హామీ అని అన్నారు. వారణాసిలో కాంగ్రెస్ బలపరిచిన అజయ్ రాయ్ విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ పోటీ తీవ్రంగా ఉండబోతోందని అభిప్రాయపడ్డారు. ఈ సభలో సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments