Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ అజ్ఞాతవాసానికి ముగింపు... త్వరలో ఢిల్లీకి!

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (13:08 IST)
దాదాపు మూడు వారాలుగా అజ్ఞాతవాసంలో ఉంటున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలోనే ఢిల్లీ చేరుకుని మళ్లీ పార్టీ కార్యక్రమాలలో చురుక్కుగా పాల్గొననున్నారు. అలాగే, ఏప్రిల్ 20 నుంచి మళ్లీ ప్రారంభమయ్యే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. 
 
కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని రాహుల్ గాంధీ పట్టుబడుతున్నారు. పార్టీ అధిష్టానం అందుకు అంగీకరించి, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాతనే ఆయన తన అజ్ఞాతవాసం ముగించుకొని తిరిగి వచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. 
 
దీంతో అధిష్టానం దిగొచ్చింది. మే 15 నుంచి సెప్టెంబర్ 30లోగా సంస్థాగత ఎన్నికలను నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. దీంతో శాంతించిన రాహుల్ గాంధీ అజ్ఞాతాన్ని వీడేందుకు సమ్మతించారు. వచ్చే వారంలో ఆయన ఢిల్లీలో వాలిపోతారట. వచ్చీరాగానే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆయన ఉవ్వళ్లూరుతున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments