Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ సాధారణ ప్రయాణికుడు.. వైరల్ అవుతున్న చిత్రమిది!

త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు పూర్తిస్థాయిలో చేపట్టనున్న రాహుల్ గాంధీ సాధారణ ప్రయాణికుడిలా మారిపోయారు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు తన వీఐపీ హోదాను పక్కనబెట్టి సాదాసీదాగా నడుచుకున్

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2017 (14:41 IST)
త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు పూర్తిస్థాయిలో చేపట్టనున్న రాహుల్ గాంధీ సాధారణ ప్రయాణికుడిలా మారిపోయారు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు తన వీఐపీ హోదాను పక్కనబెట్టి సాదాసీదాగా నడుచుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన రాహుల్.. ప్రచారానికి కాసింత విరామమిచ్చి.. తన తల్లి సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొనే నిమిత్తం న్యూఢిల్లీకి వచ్చారు. ఆ తర్వాత తిరిగి అహ్మదాబాద్‌కు బయలుదేరగా, ఆయన టిక్కెట్ ఇండిగో విమానంలో బుక్ అయింది. 
 
బోర్డింగ్ పాస్ తీసుకుని, రన్ వేపై ఉన్న విమానం ఎక్కేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ ఏమాత్రం ఏమాతభేషజాలకు పోకుండా, వీఐపీనన్న హోదాను పక్కనబెట్టి, విమానం ఎక్కేందుకు తన వంతు కోసం వేచి చూస్తూ, క్యూలైన్‌లో రాహుల్ గాంధీ నిలుచున్నారు. ఈ దృశ్యాన్ని ఫోటో తీసిన ఇండిగో, "వెల్ కమ్ ఆన్ బోర్డ్ మిస్టర్ రాహుల్ గాంధీ. హ్యావ్ ఏ గుడ్ ఫ్లయిట్" అంటూ ఓ ట్వీట్‌ను ఉంచింది. 
 
ఈ ట్వీట్‌‍ను చూసిన వారిలో పలువురు రాహుల్‌ను మెచ్చుకుంటూ అభినందనలు కురిపించారు. మరికొందరు నెటిజన్లు మాత్రం ఇటీవల ఇండిగో విమానాల్లో చోటుచేసుకున్న ఘటనలను ప్రస్తావిస్తూ, ప్రశ్నలు సంధిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments