Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులను పట్టించుకోని నరేంద్ర మోడీ.. '0 out of 10: రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 18 మే 2015 (16:48 IST)
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశ ప్రధానిగా మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారే తప్ప... రైతులను కలసి, వారి కష్టాలను తెలుసుకోవడం లేదని రాహుల్ విమర్శలు కురిపించారు. మోడీకి రైతులను పట్టించుకునే సమయం కూడా లేదని మండిపడ్డారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి 10 మార్కులకుగాను సున్నా మార్కులు వచ్చాయని ఎద్దేవా చేశారు. 
 
తన సొంత నియోజకవర్గం అమేథీలో పర్యటించిన రాహుల్ గాంధీ... అక్కడ పంట నష్టపోయిన రైతులను కలుసుకున్నారు. మూడు రోజుల పాటు ఆయన అమేథీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ నిధుల నుంచి నిర్మించతలపెట్టిన పలు ప్రాజెక్టులకు రాహుల్ శంకుస్థాపన చేస్తారని యూపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ సింగ్ తెలిపారు. మరోవైపు చైనా పర్యటన విజయవంతంగా ముగించుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం దక్షిణ కొరియాకు ప్రయాణమైన సంగతి తెలిసిందే.

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments