Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీకి కేంద్రం ఝలక్.. నివాసం ఖాళీ చేయాలంటూ..

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (07:29 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేంద్రం మరోమారు ఝులక్ ఇచ్చింది. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ తాజాగా నోటీసులు జారీచేసింది. మోడీ అనే పేరు దేశంలోని దొంగలకే ఎందుకు ఉంటుందంటూ అంటూ ప్రధాని నరేంద్ర మోడీని పరోక్షంగా ఉద్దేశించి నాలుగేళ్ల క్రితం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత పూర్ణేష్ మోడీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెల్సిందే. 
 
ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపు రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్వత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. తాజాగా లోక్‌సభ హౌసింగ్ కమిటీ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీచేసింది. అదీకూడా ఏప్రిల్ 22వ తేదీ లోపు ఖాళీ చేయాలని అందులో పేర్కొంది. 
 
కాగా, సూరత్ కోర్టు రాహుల్ గాఁధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దాంతో నిబంధనల ప్రకారం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటుపడింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందనే విమర్శలు వస్తున్నాయి. దేశంలో ఎన్నో లక్షల కేసులు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంటే రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం దావా కేసు విచారణను నాలుగేళ్లలో పూర్తి చేసి తీర్పునివ్వడం, ఆ తర్వాత ఆయన ఎంపీపై అనర్హత వేటు వేయడం, ఇపుడు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేయడం అనేది కుట్రపూరితమే అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments