Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ రైలు ప్రయాణం... సమస్యలు చెప్పుకున్న ప్రయాణికులు

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (10:29 IST)
కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్ గాంధీ రైలులో ప్రయాణించారు. బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వెళ్లే క్రమంలో ఆయన రైలులో ప్రయాణం చేసారు. ఈ సందర్బంగా ఓ హాకీ క్రీడాకారిణి.. రాహుల్‌తో తన సమస్యలను వివరించింది. అలాగే, పలువురు ప్రయాణికులు కూడా తమ కష్టాలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు అందుతున్న శిక్షణ, వసతులు, 'ఖేలో ఇండియా' పథంకంపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
సోమవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ తిరుగు ప్రయాణంలో మాత్రం రైలులో ప్రయాణించారు. రాయ్‌పూర్‌కు వెళ్లే క్రమంలో ఆయన బిలాస్‌పూర్ - ఇత్వారీ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రె్ స్లీపర్ క్లాస్ తరగతిలో ప్రయాణించారు. రాహుల్ వెంట ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేస్ బఘేల్, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. 
 
ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు. రైల్లోని హాకీ క్రీడాకారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓ హాకీ క్రీడాకారిణి రాహుల్‌తో తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పుకున్నారు. స్థానిక రాజనంద్‌గావ్‌లోని మైదానం హాకీ ఆడేందుకు అనువుగా లేదన్న విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై తాము గతంలోనే ఫిర్యాదు చేశామని కూడా చెప్పారు. అలాగే, ఖేలో ఇండియా ద్వారా మె అందుతున్న సౌకర్యాల గురించి వాకబు చేశారు. శిక్షణ తరగతులు ఎలా ఉన్నాయంటూ ప్రశ్నించారు. 
 
రాహుల్ ట్రైన్ జర్నీపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ స్పందించింది. వాళ్ల ముఖాల్లో ఆనందం చూడండి. రాహుల్ గాంధీతో కలిసి ప్రయాణించడం వారికో గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది. జననేతకు, అభినేత (నటుడు)కు ఉన్న తేడా ఇదే అంటూ అధికారపక్షాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో పరోక్ష విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments