Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ: మేలో ముహూర్తం!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (12:06 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ త్వరలో చేపట్టనున్నారు. కాంగ్రెస్ అధినేతగా రాహుల్ గాంధీ పేరును మే నెలలో ప్రకటిస్తారని తెలుస్తోంది. అనుమానాస్పద స్థితిలో గత నెల రోజుల పైబడి సెలవులో ఉన్న రాహుల్ త్వరలోనే తిరిగి వస్తారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం ఉత్తరప్రదేశ్ పర్యటనలో స్పష్టం చేశారు. 
 
అయితే వచ్చే మే నెలలో జరుగుతుందని భావిస్తున్న సీడబ్ల్యూసీ సమావేశంలో గానీ, లేదా అంతకంటే ముందే జరుగుతుందని భావిస్తున్న ఏఐసీసీ సమావేశంలో గానీ రాహుల్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే నెలలో రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల పైన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 
 
ఒకవేళ రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సముఖమంగా ఉంటే సోనియా పార్టీ చైర్ పర్సన్‌గా కొనసాగుతారని చెబుతున్నారు. కాగా, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ఏప్రిల్ నెలలో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టే అవకాశాలున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది మే నెలకు వాయిదా పడింది. ఏప్రిల్ నెలలో రాహుల్‌కు పెద్ద బాధ్యతలని ఆ పార్టీకి చెందిన సీనియర్లు గతంలో వ్యాఖ్యానించారు
 

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments