Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీకి అస్వస్థత - ఎన్నికల ప్రచారం రద్దు

ఠాగూర్
గురువారం, 23 జనవరి 2025 (17:59 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన తన ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్ని, ర్యాలీని రద్దు చేసుకున్నారు. వైద్యుల సలహా మేరకు రాహుల్ విశ్రాంతి తీసుకుంటున్నారు. వచ్చే నెల ఐదో తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున రాహుల్ ప్రచారం చేస్తున్నారు. 
 
ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో రాహుల్ అస్వస్థతకు లోనయ్యారు. ఆయనను పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో రాహుల్ తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారని ఢిల్లీ పీసీసీ చీఫ్ దేవేంద్ర యాదవ్ తెలిపారు. 
 
అయితే, శుక్రవారం మాత్రం యధావిధిగా రాహుల్ ఎన్నికల ప్రచారం సాగుతుందని చెప్పారు. భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించే అవకాశం ఉందని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కాగా, భారత గణతంత్ర వేడుకల తర్వాత ఈ ఎన్నికల ప్రచారం మరింత ముమ్మరంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

హృదయాలను హత్తుకునేలా గాంధీ తాత చెట్టు - రివ్యూ

నాకు వేల కోట్ల క్లబ్ వద్దు - దేవుడిచ్చింది చాలు : వెంకటేష్

తిరుపతిలో సెటిల్ అవుతా, గోవిందా... గోవిందా నామస్మరణతో నిద్రలేస్తా: జాన్వీ కపూర్

సంక్రాంతికి వస్తున్నాం.. జబర్దస్త్ స్కిట్టా? దర్శకుడు అనిల్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

తర్వాతి కథనం
Show comments