Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుస్తుల దుకాణంలో కొండచిలువ.. గంటన్నర తర్వాత ఏమైంది?

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (13:48 IST)
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని లాల్‌కుర్తి పీఠ్ ప్రాంతంలోని ఒక వస్త్ర దుకాణంలో సుమారు 14 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. వెంటనే షాపు యజమాని రవికుమార్ తన ఉద్యోగులు, కస్టమర్లతో కలిసి దుకాణాన్ని ఖాళీ చేయించి మీరట్ అటవీ శాఖకు సమాచారం అందించారు. 
 
ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ..,తన కస్టమర్లలో ఒకరు దుకాణంలో కొండ చిలువ వుండటాన్ని గుర్తించారని చెప్పాడు. దీంతో అందరూ భయాందోళనకు గురై దుకాణం నుంచి బయటికి వెళ్లిపోయారు. తాము కూడా షాపు బయట వుండి.. అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చాం. దాదాపు గంటన్నర పోరాటం తర్వాత కొండచిలువను అధికారులు పట్టుకున్నారని చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
షాప్‌లోని బట్టల రాక్‌పై కొండచిలువ జారిపోతున్నట్లు వీడియోలో ఉంది. మీరట్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కొండచిలువను రక్షించి సురక్షితంగా తిరిగి దానిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments