Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌కు... పీవి శ‌త‌జ‌యంతి పుస్త‌కాలు

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (16:47 IST)
ప్రజలకు దిశా నిర్దేశం చేసిన మహనీయుల జీవితాల గురించి ముందు తరాలు తెలుసుకోవలసిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. హైదరాబాద్ లో పలువురు రచయితలు తమ పుస్తకాలను ఉపరాష్ట్రపతికి అందజేశారు.

ముఖ్యంగా మాజీ ప్ర‌ధాని పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన వివిధ పుస్తకాలను రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఉప రాష్ట్రపతికి అందజేశారు. పీవీపై పరిశోధనాత్మకంగా ఈ పుస్తకాలను ప్రచురించే చొరవ తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉప రాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు.
 
దక్కను ప్రాంతంలోని ఉర్దూ రచయితల జీవిత విశేషాలను తెలియజేస్తూ, ప్రముఖ పాత్రికేయులు ఇఫ్తేకార్ రచించిన జెమ్స్ ఆఫ్ డక్కన్ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశారు. శ్రీరాముణ్ని ఆదర్శ పురుషునిగా చూపిన 16 గుణాలను వివరిస్తూ, సత్యకాశీ భార్గవ రాసిన మానవోత్తమ రామ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి స్వీకరించారు. నల్గొండ కథలు పుస్తకాన్ని యువ రచయిత మల్లికార్జున్ ఉప రాష్ట్రపతికి అందజేశారు. కథలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలన్న ఆయన, ప్రజల జీవన విధానాన్ని, మనసులను పుస్తకంలో ఆవిష్కరించిన రచయితకు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments