Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ పతాకాన్ని ట్విట్టర్ ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకోండి : ప్రధాని పిలుపు

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (17:14 IST)
భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు ఆగస్టు 15వ తేదీన దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఈ వేడుకలను నిర్వహిచనుంది. ఈ నేపథ్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా, ఆగస్టు 15వ తేదీన దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని ఇప్పటికే పిలుపునిచ్చారు. 
 
ఇపుడు కొత్తగా 75వ స్వాతంత్ర్య దినోత్సవాల నేపథ్యంలో దేశ ప్రజలంతా తమ సోషల్ మీడియా ఖాతాల్లో జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచించారు. ఈ మేరకు ఆదివారం జరిగిన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
పింగళి వెంకయ్య జ్ఞాపకంగా..
భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి రోజైన ఆగస్టు 2వ తేదీ నుంచి స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీ వరకు.. ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండాను పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. 'భారత దేశం 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుంటోంది. ఈ చరిత్రాత్మక ఘట్టానికి మనందరం సాక్షులు కాబోతున్నాం' అని పేర్కొన్నారు.
 
కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13, 14, 15 తేదీల్లో దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల నివాసాలపై జాతీయ జెండాను ఎగరవేయనున్నట్టు అంచనా.
 
ఈ కార్యక్రమం కోసమని జాతీయ జెండాల తయారీకి సంబంధించిన కోడ్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం సడలించింది. పాలిస్టర్, కాటన్, ఉన్ని, సిల్క్, ఖాదీ వస్త్రాలన్నింటినీ జాతీయ జెండా తయారీకి వినియోగించవచ్చని పేర్కొంది. 
 
అదేవిధంగా జెండా పరిమాణంపైగానీ, ఎగరవేసే సమయంపైగానీ ఉన్న ఆంక్షలను కొద్దిరోజుల పాటు సడలిస్తున్నట్టు ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments