Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దనోట్ల రద్దు ఎఫెక్టు : టాక్సీడ్రైవర్ జన్‌ధన్ ఖాతాలోకి రూ.9806 కోట్లు

దేశంలో పెద్ద నోట్ల రద్దుతో చిత్రవిచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పెద్ద నోట్లు చెలామణిలో ఉన్నపుడు నిరుపేదలుగా ఉన్న వారు.. రాత్రికిరాత్రే కోటీశ్వరులై పోతున్నారు. అలాగే, నల్లకోటీశ్వలు పేదలుగా మారిపోత

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (08:49 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దుతో చిత్రవిచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పెద్ద నోట్లు చెలామణిలో ఉన్నపుడు నిరుపేదలుగా ఉన్న వారు.. రాత్రికిరాత్రే కోటీశ్వరులై పోతున్నారు. అలాగే, నల్లకోటీశ్వలు పేదలుగా మారిపోతున్నారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. ఓ టాక్సీ డ్రైవర్ ఖాతాలోకి ఏకంగా రూ.9806 కోట్లు జమ అయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పేరు బల్వీందర్ సింగ్. ఓ టాక్సీ డ్రైవర్. పంజాబ్‌లో నివశిస్తున్నాడు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలాలో అతడికి ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద ఒక ఖాతా ఉంది. ఈనెల 4వ తేదీన ఉన్నట్టుండి అతడి ఖాతాలోకి దాదాపు 9806 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఇంత స్థాయిలో తన ఖాతాలోకి డబ్బులు రావడం ఏంటని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. 
 
తన మొబైల్ నంబరుకు వచ్చిన ఎస్ఎంఎస్‌ను పదే పదే చూసుకుని మురిసిపోయాడు. కానీ, అతడి సంతోషం గట్టిగా రెండు రోజులు కూడా ఉండలేదు. ఆ మొత్తం డబ్బంతా మర్నాడే ఖాతాలోంచి మాయమైపోయింది. అసలు ఆ డబ్బు ఎవరిది? ఎలా వచ్చింది? తన ఖాతాలోంచి తాను సంతకం పెట్టకుండా ఎలా వెళ్లిపోయిందనే విషయం అతనికి తెలియదు. 
 
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎవరైనా నల్లధనాన్ని మార్చుకోడానికి వేసుకున్నారా అని కూడా అనుమానం వచ్చింది. ఇదే విషయం గురించి బ్యాంకు అధికారులను కూడా చాలాసార్లు అడిగాడు. కానీ ఫలితం లేదు. పైగా.. తన పాస్‌బుక్‌ను వాళ్లు నవంబర్ 7వ తేదీన తీసుకుని వాళ్ల దగ్గరే ఉంచుకున్నారని, తర్వాత కొత్త పాస్‌బుక్ ఇచ్చారు గానీ, అందులో ఈ 9806 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంట్రీ లేదని బల్వీందర్ చెపుతున్నాడు. 
 
నిజానికి తన ఖాతాలో 3 వేల రూపాయలు ఉంటుందని, ఆ మొత్తం తనది కానే కాదని స్పష్టం చేశాడు. దీనిపై బ్యాంకు మేనేజర్ రవీందర్ కుమార్‌ను అడిగినా, వివరాలు ఏమీ చెప్పలేదు. ఆదాయపన్ను శాఖ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారన్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments