Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ కోట కాంగ్రెస్ హస్తగతం : ముఖ్యమంత్రిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ?

పంజాబ్ కోట కాంగ్రెస్ హస్తగతమైంది. దశాబ్దకాలంగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్... శనివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో అకాలీదళ్ కోటను బద్దలు కొట్టి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా కాంగ్రెస్ దూ

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (12:34 IST)
పంజాబ్ కోట కాంగ్రెస్ హస్తగతమైంది. దశాబ్దకాలంగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్... శనివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో అకాలీదళ్ కోటను బద్దలు కొట్టి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. మొత్తం 117 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 73 సీట్లలో ఆధిక్యంలో ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా తెలుస్తోంది. కాంగ్రెస్ విజయం కోసం తీవ్రంగా శ్రమించిన ఆ పార్టీ పంజాబ్ చీఫ్ అమరీందర్ సింగ్ మాత్రం వెనుకబడ్డారు.
 
ఇదిలావుండగా, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు ఆ రాష్ట్ర ప్రజలు పుట్టినరోజు బహుమతిని అందించారు. శనివారం కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ 75వ పుట్టినరోజు. దీంతో ప్రజలు ఆయనకు బర్త్‌డే గిఫ్ట్‌గా అధికారం కట్టబెట్టనున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. లంబి, పాటియాలా స్థానాల నుంచి అమరీందర్‌ పోటీ చేశారు. లంబిలో ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌పై ఆయన వెనుకంజలో ఉండగా.. పాటియాలాలో ముందంజలో ఉన్నారు. 
 
అయితే, ఈ దఫా ముఖ్యమంత్రి కుర్చీని మాత్రం మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్ధూ చేరిక కాంగ్రెస్ పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది. ఫలితంగా పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించిందనే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments